జీఎస్టీ పరిహారం కింద మరో ₹40వేల కోట్లు.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే.?

జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరో రూ.40వేల కోట్లు విడుదల చేసింది.

Published : 07 Oct 2021 20:15 IST

దిల్లీ: జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరో రూ.40వేల కోట్లు విడుదల చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదల చేసిన మొత్తం 1.15 లక్షల కోట్లకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ  గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.823.17 కోట్లు, తెలంగాణకు రూ.1149.46 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే రూ.1.59 లక్షల కోట్ల లోటును రిజర్వుబ్యాంకు నుంచి తీసుకొనే రుణం ద్వారా చెల్లించడానికి మే 28న జరిగిన 43వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం అంగీకరించింది. 2020-21లో ఇదే విధానంలో కేంద్రం రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్లు అందించింది. 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు చెల్లిస్తోంది. సెస్‌ వసూళ్ల ఆధారంగా చెల్లించే రూ.లక్ష కోట్ల పరిహారం కూడా కలిపితే ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లు అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. జులై 15న విడుదల చేసిన రూ.75వేల కోట్లతో కలిపి ఇప్పటి వరకు జీఎస్టీ పరిహారం కింద 1.15 కోట్లను బ్యాక్‌-టు-బ్యాక్‌ లోన్‌ రూపంలో రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని