
Updated : 30 Apr 2021 12:14 IST
Covaxin టీకా ధర తగ్గింపు
ఒక్కో డోసు రూ.400కే రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రాలకు సరఫరా చేసే ‘కొవాగ్జిన్’ టీకా డోసు ధరను భారత్ బయోటెక్ తగ్గించింది. ఇంతకు ముందు ఒక్కో డోసు టీకాను రూ.600 ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని రూ.400 కు తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ‘‘ప్రజారోగ్యం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు టీకాను రూ.400 ధరకు సరఫరా చేయాలని నిర్ణయించాం’’ అని భారత్ బయోటెక్ ప్రకటించింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొవిషీల్డ్ టీకాను డోసుకు రూ.400గా ప్రకటించి, తదుపరి రూ.300కు తగ్గించిన సంగతి విదితమే. కేంద్రప్రభుత్వ సంప్రదింపుల మేర కంపెనీలు టీకా ధరలను తగ్గించాయి.
ఇవీ చదవండి
Tags :