Vodafone Idea: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్‌ మైలురాయి.. అధిక వేగంలో రికార్డ్‌!

5G Trials: 5జీ ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

Published : 19 Sep 2021 20:28 IST

దిల్లీ: దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పుణెలో నిర్వహించిన 5జీ ట్రయల్స్‌లో 3.7 గిగాబిట్‌ పర్‌ సెకెన్‌ (జీబీపీఎస్‌) వేగంతో డేటాను బదిలీ చేసినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గాంధీనగర్‌, పుణెలో మిడ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో 1.5 జీబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అందుకున్నట్లు తెలిపింది. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే ఇదే అత్యధిక వేగంగా కావడం గమనార్హం.

దేశంలో 5జీ ట్రయల్స్‌కు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాకు టెలికాం శాఖ (డాట్‌) మే నెలలో అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు ఆయా టెలికాం సంస్థలు ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వొడాఫోన్‌కు సంప్రదాయ 3.5 GHz స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌తో పాటు 26 గిగాహెర్జ్ట్‌ (Ghz) హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను డాట్‌ కేటాయించింది. పుణెలో నిర్వహించిన ట్రయల్స్‌లో 3.7 జీబీపీఎస్‌ వేగాన్ని తక్కువ లేటెన్సీతో అందుకున్నట్లు వీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని