Adani Cement: అదానీ సిమెంట్‌ 3.5 బిలియన్‌ డాలర్ల లోన్‌ రీఫైనాన్స్‌

Adani Cement: ఏసీసీ, అంబుజా సిమెంట్‌ను కొనుగోలు కోసం తీసుకున్న రుణాన్ని రీఫైనాన్స్‌ చేయడానికి 10 అంతర్జాతీయ బ్యాంకులు ముందుకు వచ్చినట్లు అదానీ సిమెంట్ వెల్లడించింది.

Updated : 20 Oct 2023 15:29 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత సడలిన ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం కోసం అదానీ గ్రూప్‌ (Adani Group) అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా ఆ దిశగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 3.5 బిలియన్‌ డాలర్లు విలువ చేసే రుణాన్ని రీఫైనాన్స్‌ (Refinance) చేయడానికి అంతర్జాతీయ బ్యాంకులు అంగీకరించినట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. రీఫైనాన్స్‌ అంటే రుణగ్రహీతకు మరిన్ని అనుకూలమైన షరతులతో పాత రుణ స్థానంలో కొత్త రుణాన్ని ఇవ్వడం.

ఏసీసీ, అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేయడం కోసం అదానీ గ్రూప్‌ (Adani Group) వివిధ సంస్థల నుంచి రుణం తీసుకుంది. 3.5 బిలియన్‌ డాలర్ల ఆ రుణాన్ని రీఫైనాన్స్‌ చేయడానికి 10 అంతర్జాతీయ బ్యాంకులు ముందుకు వచ్చినట్లు అదానీ సిమెంట్‌ తెలిపింది. వీటి కాలపరిమితి మూడేళ్లని వెల్లడించింది. ఈ పరిణామంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం బలపడడంతో పాటు తమ గ్రూప్‌ కంపెనీలకు మూలధన మద్దతు ఉన్నట్లు నిరూపితమైందని పేర్కొంది.

కంపెనీల షేర్ల ధరలను పెంచడం కోసం అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలకు పాల్పడిందంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ భారీగా కుంగింది. అప్పటి నుంచి ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొనడానికి కంపెనీ అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొన్ని రుణాలను గడువు తీరకముందే చెల్లించేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని