Drishti 10: భారత్‌ తొలి దేశీయ యూఏవీ ‘దృష్టి 10 స్టార్‌లైనర్‌’ ఆవిష్కరణ

భారత్‌ సొంతంగా మొట్టమొదటి మానవ రహిత విమానాన్ని ప్రారంభించింది. ఇది సుదీర్ఘ సమయం గాల్లో ఉండి శత్రువుపై నిఘా వేయగలదు.

Updated : 10 Jan 2024 12:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయంగా తయారు చేసిన తొలి మానవ రహిత (యూఏవీ) విమానాన్ని హైదరాబాద్‌ తుక్కుగూడాలోని అదానీ ఏరోస్పేస్‌ పార్క్‌లో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ ప్రారంభించారు. దీనిని ‘దృష్టి 10 స్టార్‌లైనర్‌’గా వ్యవహరిస్తున్నారు. యూఏవీ రంగంలో భారత్‌కు ఇది కీలక ముందడుగు. దీనికి ఇంటెలిజెన్స్‌, నిఘా (ఐఎస్‌ఆర్‌) సామర్థ్యాలున్నాయి. గాల్లో 36 గంటలపాటు ఎగరగలదు. 450 కిలోల పేలోడ్‌ను తీసుకెళుతుంది. స్టాంగ్‌4671 సర్టిఫికేషన్‌ రావడంతో అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేయగలదు. 

పిల్లల ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఫీడ్‌లో ఇక అవి కనిపించవు: మెటా

ఈ సందర్భంగా అడ్మిరల్‌ హరికుమార్‌ మాట్లాడుతూ ‘‘సముద్రంపై ఆధిపత్యం, ఐఎస్‌ఆర్‌ సాంకేతికతలో ఆత్మనిర్భర్‌కు ఇది కీలక ముందడుగు. అదానీ గ్రూపు ఈ రంగంలో తయారీపైనే కాకుండా.. సామర్థ్యాల అభివృద్ధిపై కూడా ఓ క్రమపద్దతిలో పని చేసింది. దృష్టి 10ను నౌకాదళ కార్యకలాపాల్లో భాగస్వామిని చేయడంతో మా సామర్థ్యాలు మెరుగుపడనున్నాయి. సముద్ర గస్తీలో మా సంసిద్ధత బలోపేతం అవుతుంది. కేవలం 10 నెలల్లోనే ఈ యూఏవీని తయారు చేయడం అదానీ డిఫెన్స్‌ నిబద్ధతను తెలియజేస్తోంది’’ అని పేర్కొన్నారు.

తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘‘ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యూఏవీని ఆవిష్కరించడం గొప్ప విజయం. హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలం. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. హైదరాబాద్ ఏరోస్పేస్ రంగంలో తయారీ, ఇతర సాంకేతిక పరంగా ముందుంది. భారత రక్షణ రంగంలో అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ కీలక పాత్ర పోషిస్తోంది’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని