Air India: బ్యాంకాక్‌, సింగపూర్‌ రూట్లలో ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్లు.. అక్టోబర్‌ 21 వరకే!

Air India: బ్యాంకాక్‌, సింగపూర్‌ రూట్లలో టికెట్లపై ఎయిరిండియా రాయితీలు ప్రకటించింది. ఈ పరిమితకాల ఆఫర్‌ అక్టోబర్‌ 21తో ముగియనుంది. ఈ ఆఫర్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వాళ్లు వచ్చే ఏడాది మార్చి ముగిసే లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Published : 18 Oct 2023 17:59 IST

Air India | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇండియా- సింగపూర్‌ (India- Singapore), ఇండియా- బ్యాంకాక్‌ (India- Singapore) రూట్లలో టికెట్ల ధరలపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తోంది. అక్టోబర్‌ 18 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 21న ముగియనుంది. ఈ ప్రత్యేక సేల్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వాళ్లు మార్చి 2024 ముగిసే లోగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ప్రత్యేక సేల్‌లో భాగంగా ఇండియా- సింగపూర్‌ (India- Singapore) వెళ్లిరావడానికి ఎకానమీ టికెట్‌ ధరను ఎయిరిండియా (Air India) రూ.13,330గా నిర్ణయించింది. బిజినెస్‌ క్లాస్‌ అయితే, కనీసం రూ.70,290 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాంకాక్‌ వెళ్లి వచ్చేందుకు అయ్యే టికెట్‌ ధర రూ.17,045 నుంచి ప్రారంభమవుతోంది. అదే బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.49,120. అయితే, నగరాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కావాలంటే కేవలం వెళ్లడానికే మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సింగపూర్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఆఫర్లు వర్తిస్తాయి. అక్కడి కరెన్సీకి అనుగుణంగా ధరలను నిర్ణయించారు.

ఈ ప్రత్యేక ఆఫర్లను ఉపయోగించుకోవడానికి ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ నుంచి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. లేదా అధీకృత ట్రావెల్‌ ఏజెంట్ల వద్ద కూడా బుకింగ్‌ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయని.. ముందు బుక్‌ చేసుకున్న వారికి ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. ఈ నెల మొదట్లో ఐరోపాలోని పలు నగరాలకూ ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్లకు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎయిరిండియా (Air India) 2023 అక్టోబర్‌ 23 నుంచి కోల్‌కతా- బ్యాంకాక్‌ మార్గంలో రెగ్యులర్‌ విమాన సేవలను ప్రారంభించనుంది.

ఇండియా- సింగపూర్‌ టికెట్ల ధరల వివరాలు..

ఇండియా- బ్యాంకాక్‌ టికెట్ల ధరల వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని