Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాళ్లందరికీ అన్‌లిమిటెడ్‌ డేటా!

Airtel Unlimited 5G Data Offer: ఎయిర్‌టెల్‌ (Airtel) తీసుకొచ్చిన ఈ అపరిమిత డేటా ఇంట్రడక్టరీ ఆఫర్‌ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే రూ.239, అంతకంటే ఎక్కువ మొత్తం ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న ప్రీపెయిడ్‌ యూజర్లకు కూడా ఇది వర్తిస్తుంది.

Updated : 17 Mar 2023 14:55 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) తమ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం 5జీ వాడుతున్న కస్టమర్లకు అపరిమిత డేటా వాడుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం డేటాపై విధిస్తున్న రోజువారీ పరిమితిని ఎత్తి వేసింది. ప్రస్తుతం 4జీ ప్లాన్లకు వర్తించే డేటా లిమిట్‌ 5జీ కస్టమర్లకు వర్తించదన్నమాట! ప్రస్తుతం జియో సైతం తమ 5జీ కస్టమర్లకు వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 

5జీ హ్యాండ్‌ సెట్‌ కలిగి 5జీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న అందరికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అయితే, కనీసం రూ.239, అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జ్‌ చేసుకునే కస్టమర్లకు ఈ ఆఫర్‌ లభిస్తుంది. ప్రీపెయిడ్‌తో పాటు పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని ఎయిర్‌టెల్‌ (Airtel) తెలిపింది. కస్టమర్లు రోజువారీ డేటా పరిమితి గురించి ఆలోచించకుండా ఇంటర్నెట్‌ను ఎంజాయ్‌ చేయడంతో పాటు ఆన్‌లైన్‌ సేవల్ని పొందాలనే లక్ష్యంతోనే ఈ ప్రవేశ ఆఫర్‌ను తీసుకొస్తున్నామని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఎయిర్‌టెల్‌ (Airtel), జియో సంస్థలు పోటా పోటీగా తమ 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ వెళుతున్నాయి. 5జీ సేవల ఆరంభం నుంచే జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద అపరిమిత డేటా సదుపాయయాన్ని అందిస్తోంది. మరోవైపు ఇటీవలే పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులనూ ఆకర్షించేందుకు జియో ప్లస్‌ పేరిట ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ తమ 5జీ వినియోగదారులకు అన్‌లిమిటెడ్‌ డేటాను ప్రకటించింది. వినియోగదారులు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లోకి వెళ్లి అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా ఆఫర్‌ను పొందొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలు దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
(ఇదీ చదవండి: జియో ప్లస్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాలివే)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని