Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్కు సిద్ధమైంది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరోసారి పండుగ ఆఫర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలో బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సేల్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో సేల్ ప్రకటనను ఉంచింది. అయితే, ఈ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. వచ్చే నెలలో దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను నిర్వహించాలని చూస్తోంది. అక్టోబరు మొదటి వారంలో ఈ సేల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఈ సేల్‌లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లపై భారీగా ఆఫర్లు ఉండనున్నాయని వెబ్‌సైట్‌లోని ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, యాక్ససెరీస్లపై 50 నుంచి 80 శాతం, టీవీ, హోమ్ అప్లయెన్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెబ్సైట్ పేర్కొంది. ఇక హోమ్ డెకార్, బ్యూటీ, స్పోర్ట్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది.
వాహన ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి!
బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా వివో, శాంసంగ్, మోటోరోలా కంపెనీలకు చెందిన ఆరు కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. ఇవేకాకుండా ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎంత మేర డిస్కౌంట్ ఇస్తుందనే దానిపై యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనవరి నుంచి కార్ల ధరల పెంపు..
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వెల్లడించాయి. -
6 నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 6 నెలల గరిష్ఠానికి చేరాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర సోమవారం 2013.99 డాలర్లకు చేరింది. -
రేమండ్ వ్యాపారం సాఫీగా సాగుతుంది
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరోసా ఇచ్చారు. -
రూ.13,000 కోట్లతో భారత్‌లో ఫాక్స్‌కాన్ విస్తరణ!
ఐఫోన్ తయారీ సంస్థ హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ భారత్‌లో మరింత విస్తరించనుంది. ఫాక్స్కాన్గా సుపరిచితమైన ఈ సంస్థ ఇక్కడి నిర్మాణ ప్రాజెక్టులపై 1.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్‌లో పూర్తి వాటా విక్రయించం
బ్యాంకస్యూరెన్స్ ప్రయోజనాలు పొందేందుకు, ఐడీబీఐ బ్యాంక్‌లో కొంత వాటా అట్టే పెట్టుకోవాలని.. ఆ బ్యాంక్ ప్రమోటర్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తోంది. -
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుందాం
కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. -
66,500 పాయింట్ల స్థాయి కీలకం!
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. -
అల్యూమినియంలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.61,985 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,351; రూ.62,967 వరకు రాణిస్తుందని భావించొచ్చు. -
దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం
చదువులో ఇబ్బందిపడే దివ్యాంగుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోరా’ను ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
వినియోగదారు సేవా ఏజెంట్ల పని భారం తగ్గించేందుకు ఏఐ చాట్‌బాట్‌ను వినియోగించడం ప్రారంభించినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
-
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
-
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు దంపతులు