Flipkart sale: ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో సేల్‌.. 4 రోజుల పాటు డిస్కౌంట్ల పండగ

మరో సేల్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ముందుకొచ్చింది. ‘బిగ్‌ దసరా సేల్‌’ పేరిట అక్టోబర్‌ 5 నుంచి 8వ తేదీ వరకు నాల్రోజుల పాటు సేల్‌ నిర్వహించనుంది.

Published : 03 Oct 2022 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా, దీపావళి సందర్భంగా ఇ-కామర్స్‌ సంస్థలు ఇటీవల పోటాపోటీగా భారీ సేల్స్‌ నిర్వహించాయి. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట అమెజాన్‌, ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌ నిర్వహించాయి. అమెజాన్‌ సేల్‌ ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ సెప్టెంబర్‌ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే మరో సేల్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ముందుకొచ్చింది. ‘బిగ్‌ దసరా సేల్‌’ పేరిట అక్టోబర్‌ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సేల్‌ నిర్వహించనుంది. ‘బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌’లో పాల్గొనలేకపోయిన వారు ఈ సేల్‌పై లుక్కేయొచ్చు.

మొన్నటి సేల్స్‌లో యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై డిస్కౌంట్‌ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌.. ఈ సారి హెచ్‌డీఎఫ్‌సీతో జట్టుకట్టింది. క్రెడిట్, డెబిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తామని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. అంటే 3వ తేదీ అర్ధరాత్రి నుంచే వీరు సేల్‌లో పాల్గొనవచ్చు. ప్రస్తుతానికి ఆఫర్ల వివరాలు తెలియరానప్పటికీ.. స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఫ్రిజ్‌, టీవీలపై డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ ఉన్న ఆఫర్లే దాదాపు ఉండే అవకాశం ఉంది. మొన్నటి సేల్స్‌లో ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌ లేదా ఇతర కారణాల వల్ల సేల్‌లో పాల్గొనలేకపోయిన వారు ఈ సేల్‌ను పరిశీలించొచ్చు. సేల్‌ రోజు ఆఫర్ల వివరాలు బయటకొస్తాయి. సాధారణంగా దీపావళి వరకు ఇ-కామర్స్‌ సంస్థలు మూడు సేల్స్‌ నిర్వహిస్తాయి. ఆ ప్రకారం.. దీపావళి ముందు మరో సేల్‌ సైతం వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని