Sriram Transport Finance: శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, 12- 60 నెలల కాలావధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5 శాతం వరకు పెంచింది. ఈనెల 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

Updated : 10 Aug 2022 02:58 IST

దిల్లీ: శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, 12- 60 నెలల కాలావధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5 శాతం వరకు పెంచింది. ఈనెల 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా డిపాజిట్‌దార్లు 8.75 శాతం వరకు వార్షిక వడ్డీ పొందుతారని పేర్కొంది. వయోవృద్ధులకు అదనంగా మరో 0.50 శాతం వడ్డీ ప్రయోజనం ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌ పునరుద్ధరించుకుంటే, మరో 0.25 శాతం అదనపు వడ్డీ లభిస్తుందని తెలిపింది. 5-10 సంవత్సరాల నాటి వినియోగ ట్రక్‌ల కొనుగోలుకు రుణాలు ఇస్తామని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని