నాట్కో ఫార్మా కేన్సర్‌ ఔషధానికి అమెరికాలో తాత్కాలిక అనుమతి

‘లిపోసర్కోమా’ అనే అరుదైన కేన్సర్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే ట్రాబెక్టిడిన్‌ ఇంజెక్షన్‌- 1ఎంజీ, జనరిక్‌ ఔషధాన్ని అమెరికాలో విక్రయించడానికి నాట్కో ఫార్మా సన్నాహాలు చేస్తోంది. ఈ ఔషధానికి మార్కెటింగ్‌ అనుమతి కోసం

Published : 18 Aug 2022 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘లిపోసర్కోమా’ అనే అరుదైన కేన్సర్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే ట్రాబెక్టిడిన్‌ ఇంజెక్షన్‌- 1ఎంజీ, జనరిక్‌ ఔషధాన్ని అమెరికాలో విక్రయించడానికి నాట్కో ఫార్మా సన్నాహాలు చేస్తోంది. ఈ ఔషధానికి మార్కెటింగ్‌ అనుమతి కోసం యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) వద్ద దరఖాస్తు చేయగా, తాత్కాలిక అనుమతి వచ్చినట్లు నాట్కో ఫార్మా బుధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ ఔషధాన్ని జానెస్సెన్‌ అనే బహుళ జాతి ఫార్మా కంపెనీ ‘యాండెలిస్‌’ అనే బ్రాండు పేరుతో విక్రయిస్తోంది. అమెరికాలో గత ఏడాది ఈ ఔషధం దాదాపు 50 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని