దిల్లీ హైకోర్టులో నాట్కో ఫార్మాకు అనుకూలంగా తీర్పు

క్లోరాంత్రనిలిప్రోల్‌ (సీటీపీఆర్‌) ఆధారిత క్రిమిసంహారక మందుల విషయంలో దిల్లీ హైకోర్టులో నాట్కో ఫార్మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Published : 06 Dec 2022 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్లోరాంత్రనిలిప్రోల్‌ (సీటీపీఆర్‌) ఆధారిత క్రిమిసంహారక మందుల విషయంలో దిల్లీ హైకోర్టులో నాట్కో ఫార్మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ మందులను దేశీయ మార్కెట్లో నాట్కో విక్రయించకుండా నియంత్రించే ఉద్దేశంతో ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్‌ దిల్లీ న్యాయస్థానంలో అప్పీలు చేసిన విషయం విదితమే. దీన్ని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్‌కు ఉన్న భారతీయ పేటెంట్‌ను తాము ఉల్లంఘించలేదని నాట్కో ఫార్మా వివరించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్‌ అప్పీలును కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని