సరికొత్తగా యాక్టివా 125

కొత్త ఉద్గార ప్రమాణాలకు తగ్గట్లుగా నవీకరించిన ఇంజిన్‌తో యాక్టివాలో కొత్త వెర్షన్‌ను హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా విడుదల చేసింది.

Published : 29 Mar 2023 03:28 IST

దిల్లీ: కొత్త ఉద్గార ప్రమాణాలకు తగ్గట్లుగా నవీకరించిన ఇంజిన్‌తో యాక్టివాలో కొత్త వెర్షన్‌ను హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా విడుదల చేసింది. దీని ధర రూ.78,920 (దిల్లీ, ఎక్స్‌షోరూం). ఏప్రిల్‌ 1 నుంచి కఠిన ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలకు అనుగుణంగా కొత్త యాక్టివాను తయారు చేశామని, దీనిని నడిపేటపుడు వినియోగదారులు సరికొత్త అనుభూతిని పొందేలా అధునాతన సాంకేతికతను ఉపయోగించినట్లు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టరు, సీఈఓ అత్సుషి ఒగాటా ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని