సీఐఐ అధ్యక్షుడిగా ఆర్‌.దినేశ్‌

2023-24 సంవత్సరానికి సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య) అధ్యక్షుడిగా టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌.దినేశ్‌ బాధ్యతలు స్వీకరించారు.

Published : 26 May 2023 01:02 IST

దిల్లీ: 2023-24 సంవత్సరానికి సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య) అధ్యక్షుడిగా టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌.దినేశ్‌ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఛైర్మన్‌, ఎండీ సంజీవ్‌ బజాజ్‌ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 2023-24 సీఐఐ ప్రెసిడెంట్‌- డెజిగ్నేట్‌గా ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పురి వ్యవహరిస్తారు. గురువారం జరిగిన సమావేశంలో 2023-24 సంవత్సరానికి కొత్త ఆఫీస్‌- బేరర్‌లను సీఐఐ ఎన్నుకుంది. సీఐఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ మేమాని బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ భారత ప్రాంత ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని