విమానాశ్రయాల్లో రద్దీ నియంత్రణకు బీసీఏఎస్‌ సూచనలు

విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో, నియంత్రించలేని స్థితి రాకుండా చూసేందుకు ద బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) కొన్ని సూచనలు చేసింది.

Published : 31 May 2023 01:35 IST

ముంబయి/దిల్లీ: విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో, నియంత్రించలేని స్థితి రాకుండా చూసేందుకు ద బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) కొన్ని సూచనలు చేసింది. కొత్త విమానాల కార్యకలాపాలను, సెక్యూరిటీ చెక్‌ పాయింట్ల వద్ద ఉన్న తమ ప్రయాణికుల హ్యాండ్లింగ్‌ కేంద్రాలకు అనుసంధానం చేయాలని తెలిపింది. గతేడాది దిల్లీ విమానాశ్రయంలో రద్దీ విపరీతంగా పెరగడంతో, చాంతాడంత వరుసల్లో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సూచనలు చేసింది. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కరోనా ముందు స్థాయిలను అధిగమించినందున, విమానాశ్రయాల్లో ప్రాసెసింగ్‌ సమయం, క్యూ సమయం, ప్యాసెంజరు టచ్‌ పాయింట్లు, గిరాకీ అంచనా తదితరాలను మదింపు చేస్తున్నారు. ప్రయాణికులకు అనుగుణగా తగిన సామర్థ్యాన్ని విమానాశ్రయాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని బీసీఏఎస్‌ అంటోంది. ఈ మదింపుపై మరింత శాస్త్రీయ విధానాన్ని అనుసరించడం కోసం అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్స్‌(ఏపీఏఓ)ను సైతం బీసీఏఎస్‌ అధికారులు సంప్రదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని