వెండి సానుకూలం!

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.59,441 కంటే కిందకు వస్తే బలహీనంగా కదలాడొచ్చు. మొదట రూ.59,126.. ఆ తర్వాత రూ.58,885 వరకు దిగి వచ్చే     అవకాశం ఉంటుంది.

Published : 05 Jun 2023 05:20 IST

కమొడిటీస్‌ ఈ వారం
పసిడి

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.59,441 కంటే కిందకు వస్తే బలహీనంగా కదలాడొచ్చు. మొదట రూ.59,126.. ఆ తర్వాత రూ.58,885 వరకు దిగి వచ్చే  అవకాశం ఉంటుంది. ఈ వారం రూ.59,126 వద్ద కీలక మద్దతు, రూ.60,237 ఎగువన కీలక నిరోధం ఎదురు   కావొచ్చు.


వెండి

వెండి జులై కాంట్రాక్టు ఈవారం రూ.73,184 స్థాయిని అధిగమిస్తే రూ.74,349 స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ కిందకు వస్తే రూ.70,669 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.69,319 వరకు దిగిరావొచ్చని భావించవచ్చు.


ప్రాథమిక లోహాలు

* రాగి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.702 కంటే దిగువన కదలాడకుంటే కొనుగోలు చేయొచ్చు. అందువల్ల రూ.702 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.708-712 మధ్య కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు. ఒకవేళ రూ.721 కంటే పైన కదలాడితే షార్ట్‌ సెల్లింగ్‌కు దూరంగా ఉండాలి.

* సీసం జూన్‌ కాంట్రాక్టు ఈవారం  రూ.184 దిగువన బలహీనంగా కనిపిస్తోంది. రూ.185.95 ఎగువకు వెళ్తేనే రూ.183.25 స్టాప్‌లాస్‌ పెట్టుకుని లాంగ్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపాలి.

* జింక్‌ జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.204 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. ఒకవేళ రూ.204 దిగువన చలిస్తే లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండాలి.

* అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టును ఈవారం రూ.209 ఎగువన మాత్రమే కొనుగోలు చేయాలి. అయితే రూ.203 దిగువన కొనుగోళ్లకు దూరంగా ఉండటం మంచిది.


ఇంధన రంగం

* ముడి చమురు జూన్‌ కాంట్రాక్టు రూ.5,916 దిగువన కదలాడకుంటే రూ.6,137 వరకు పరుగులు తీయొచ్చు. రూ.5,630 దగ్గర స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

* సహజ వాయువు జూన్‌ కాంట్రాక్టు రాబోయే రోజుల్లో రూ.178-225 మధ్య కదలాడొచ్చు. రూ.186 దిగువన చలించకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అయితే రూ.212 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.225 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.186 దిగువకు వస్తే రూ.173 వరకు పడిపోవచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.7,799 కంటే పైన కదలాడితే లాంగ్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవచ్చు. అయితే రూ.8,082 వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయినీ అధిగమిస్తే రూ.8,423 వరకు రాణిస్తుందని భావించవచ్చు.

* జీలకర్ర జూన్‌ కాంట్రాక్టు ఈవారం కిందకు వస్తే రూ.43,240 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయి కంటే కిందకు వస్తే  రూ.42,080 స్థాయులను పరీక్షించొచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.45,920 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని మించితే   రూ.47,440 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

* పత్తి జూన్‌ కాంట్రాక్టు ఈవారం 60,813 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. దీంతో లాభాలు స్వీకరించడం మంచిది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని