దేశీయ అంకురాలు అమెరికా విపణిని అందిపుచ్చుకుంటున్నాయ్‌

విజయవంతమైన భారత అంకుర సంస్థలు, క్రమంగా అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీకి తరలిపోయే ధోరణి ప్రారంభమైందని.. అమెరికా విపణిని అందిపుచ్చుకోవాలనే ఆకాంక్షే  ఇందుకు కారణమని ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త ఎంఆర్‌ రంగస్వామి వెల్లడించారు.

Published : 07 Jun 2023 03:10 IST

భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త రంగస్వామి

సిలికాన్‌ వ్యాలీ (అమెరికా): విజయవంతమైన భారత అంకుర సంస్థలు, క్రమంగా అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీకి తరలిపోయే ధోరణి ప్రారంభమైందని.. అమెరికా విపణిని అందిపుచ్చుకోవాలనే ఆకాంక్షేఇందుకు కారణమని ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త ఎంఆర్‌ రంగస్వామి వెల్లడించారు. గత కొన్నేళ్లలో 300-400 విజయవంతమైన భారత అంకురాలు అమెరికాకు వెళ్లాయని వివరించారు. ‘గత 3-4 ఏళ్లలోనే ఈ ధోరణి ప్రారంభమైంది. భారత్‌లో ప్రారంభమైన సాస్‌ తరహా కంపెనీలే ఇందులో అధికం. అధిక నైపుణ్యం కలిగి, భారత వ్యవస్థాపకులతో మొదలైన కంపెనీలు అతిపెద్ద అమెరికా ఖాతాదారులను పొందుతున్నాయి. తదుపరి వారికి అవసరమైన ఉత్పత్తులను సృష్టించి, వారికి చేరువయ్యేందుకు అమెరికాకు వచ్చేస్తున్నాయి’ అని రంగస్వామి వెల్లడించారు. భారీమొత్తం ఆర్డర్లు ఇచ్చే ఖాతాదారులు భారత్‌లో ఎక్కువగా లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమేనని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని