డిజిటల్‌ రుణాలపై మార్గదర్శకాల జారీ

డిజిటల్‌ రుణాల విషయంలో డిఫాల్ట్‌ లాస్‌ గ్యారెంటీ(డీఎల్‌జీ)పై ఆర్‌బీఐ గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది.

Published : 09 Jun 2023 02:14 IST

డిజిటల్‌ రుణాల విషయంలో డిఫాల్ట్‌ లాస్‌ గ్యారెంటీ(డీఎల్‌జీ)పై ఆర్‌బీఐ గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. రుణాల పంపిణీ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో పెట్టేందుకు ఇవి ఉపకరిస్తాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వంటి నియంత్రిత సంస్థ(ఆర్‌ఈ)లకు, నిర్దిష్ట షరతులకు లోబడే సంస్థకు మధ్య జరిగే కాంట్రాక్టు ఒప్పందమే డీఎల్‌జీ. దీని వల్ల రుణ పోర్ట్‌ఫోలియోలో నిర్దిష్ట పరిమితి వరకు ఆర్‌ఈలకు హామీ లభిస్తుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఒక ఆర్‌ఈ కేవలం ఒక లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌(ఎల్‌ఎస్‌పీ) లేదా ఇతర ఆర్‌ఈతో డీఎల్‌జీ ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు