Honda Activa 125: కొత్త యాక్టివా 125.. మరింత స్మార్ట్‌గా.. మరింత గ్రీన్‌గా..!

Honda Activa 125: ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 రెండో దశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ కొత్త యాక్టివా 125ని తీర్చిదిద్దారు.

Published : 28 Mar 2023 21:11 IST

Honda Activa 125 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా’ సరికొత్త యాక్టివా 125 (Honda Activa 125)ని విడుదల చేసింది. ధరల శ్రేణి రూ.78,920- 88,093 (ఎక్స్‌షోరూం). డ్రమ్‌, డ్రమ్‌ అలాయ్‌, డిస్క్‌, హెచ్‌-స్మార్ట్‌ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కాస్మెటిక్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. పర్ల్‌ నైట్‌ స్టార్ట్‌ బ్లాక్‌, హెవీ గ్రే మెటాలిక్‌, రెబెల్‌ రెడ్‌ మెటాలిక్‌ పర్ల్‌ ప్రీషియస్‌ వైట్‌, మిడ్‌ నైట్‌ బ్లూ మెటాలిక్‌ అనే ఐదు రంగుల్లో కొత్త యాక్టివా 125 లభిస్తోంది.

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 రెండో దశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ కొత్త యాక్టివా 125 (Honda Activa 125)ని తీర్చిదిద్దారు. 125 సీసీ, ఫ్యుయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌ ఉన్న ఈ స్కూటర్‌ 6,250 ఆర్‌పీఎం వద్ద 8.19 బీహెచ్‌పీ శక్తిని, 5,000 ఆర్‌పీఎం వద్ద 10.4 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ హెచ్‌-స్మార్ట్‌ వేరియంట్‌లో యాక్టివా 6జీ-హెచ్‌ స్మార్ట్‌ వేరియంట్‌లో ఉన్న ఫీచర్లన్నింటినీ ఇచ్చారు. 5-ఇన్‌-1 లాక్‌ స్విచ్‌తో వచ్చే స్మార్ట్‌ కీ దీంట్లోని ప్రత్యేకత.
(ఇదీ చదవండి: ఏప్రిల్‌ నుంచి అమల్లోకి బీఎస్‌ 6 కొత్త నిబంధనలు.. ఏమేం మారుతాయ్‌!)

  • స్మార్ట్‌ ఫైండ్‌: స్కూటర్‌ చుట్టుపక్కల ఉండి ఆన్సర్‌ బ్యాక్‌ బటన్‌ నొక్కితే.. నాలుగు ఇండికేటర్లు రెండు సార్లు వెలుగుతాయి.
  • స్మార్ట్‌ అన్‌లాక్‌: ఫిజికల్‌ కీ అవసరం లేకుండానే దీన్ని లాక్‌, అన్‌లాక్‌ చేయొచ్చు. అలాగే 20 సెకన్ల పాటు ఎలాంటి యాక్టివిటీ లేకపోతే హ్యాండిల్‌ ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతుంది.
  • స్మార్ట్‌ స్టార్ట్‌: స్కూటర్‌కు రెండు మీటర్ల పరిధిలో ఉండి.. చేతిలో ఉండే చిన్న రిమోట్‌లోని నాబ్‌ను ఇగ్నిషన్‌ వరకు తిప్పి స్టార్ట్‌ బటన్ నొక్కితే.. ఇంజిన్‌ ఆన్‌ అవుతుంది.
  • స్మార్ట్‌ సేఫ్‌: ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌, స్మార్ట్‌ కీ మధ్య మ్యాచింగ్‌ ఐడీ ఉంటుంది. దీనివల్ల నాన్‌-రిజిస్టర్డ్ ‘కీ’తో స్కూటర్‌ను స్టార్ట్‌ చేయడం కుదరదు.
  • సీట్‌ అన్‌లాకింగ్‌, ఇంధన ట్యాంకు మూత తీయడానికి కూడా స్మార్ట్‌ కీ స్విచ్‌ని ఉపయోగించుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని