FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్‌

ఈ కొత్త వ‌డ్డీ రేట్లు సెప్టెంబ‌రు 26, 2022 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి. 

Updated : 26 Sep 2022 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌ అన్ని కాల వ్య‌వ‌ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం సాధార‌ణ పౌరుల‌కు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధికి 2.75 శాతం నుంచి 6.10 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేట్ల‌ను బ్యాంకు అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు అన్ని ఎఫ్‌డీల‌ కాల‌వ్య‌వ‌ధుల‌కు అద‌నంగా 0.50% వ‌డ్డీని ఇస్తోంది. వారికి గ‌రిష్ఠంగా 6.60 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ల‌భిస్తోంది. ఈ వ‌డ్డీ రేట్లు రూ. 2 కోట్ల‌ లోపు డిపాజిట్ల‌కు వ‌ర్తిస్తాయి. కొత్త వ‌డ్డీ రేట్లు సెప్టెంబ‌రు 26 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని