ICICI: MCLRను పెంచిన ఐసీఐసీఐ

ఐసీఐసీఐ MCLR వడ్డీ రేట్లను పెంచింది. దీంతో గృహ రుణ రేట్లు, ఈఎంఐలు భారం కానున్నాయి.

Published : 01 Mar 2023 16:09 IST

దిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు అందించే మార్జినల్‌ కాస్ట్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేట్లు (MCLR)ను అన్ని కాలవ్యవధులకు 10 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. ఒక బేసిస్‌ పాయింట్‌ 0.01 శాతానికి సమానం. ఒక నెల MCLR 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక సంవత్సరం MCLR 8.75 శాతానికి పెరిగింది. పెరిగిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీనివల్ల గృహ రుణం, ఇతర రుణ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. గృహరుణ వడ్డీ రేటు పెరగడంతో 'ఈఎంఐ' పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని