Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ @ 60,593

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం సూచీలు(Stock Market) లాభాలతో ప్రారంభమయ్యాయి.

Published : 08 Feb 2023 09:51 IST

ముంబయి:  రెండు రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్లు (Stock Market) కోలుకున్నాయి. ఆర్‌బీఐ(RBI) ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.33 గంటలకు సెన్సెక్స్‌ (Sensex) 307 పాయింట్ల లాభంతో  60593 వద్ద.. నిఫ్టీ(Nifty) 106 పాయింట్ల లాభంతో 17828 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.66 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హిందాల్కో, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పవర్‌గ్రిడ్‌ కార్ప్‌, హీరోమోటో కార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ఇండియా, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని