LIC: రిలయన్స్‌ విభజన ప్రక్రియతో.. ఎల్‌ఐసీకి ‘జియో’లో 6.66 శాతం వాటా..

LIC: విభజన ప్రక్రియతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా సంస్థ మంగళవారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

Published : 22 Aug 2023 20:57 IST

ఇంటర్నెట్‌డెస్క్: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL) నుంచి ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (Jio Financial Services Limited) వేరయ్యింది. ఈ విభజన ప్రక్రియతో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో 6.66 శాతం వాటా తమ సొంతమైనట్లు ఎల్‌ఐసీ (LIC) తెలిపింది. ఈ విషయాన్ని బీమా సంస్థ మంగళవారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

జీఎస్‌టీ రివార్డ్‌ స్కీమ్‌.. రూ.కోటి వరకు ప్రైజ్‌ మనీ

భారీ అంచనాలతో ఆగస్టు 21న ఎంట్రీ ఇచ్చిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బీఎస్‌ఈలో 1.20 శాతం లాభంతో రూ.265 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈలో సైతం రూ.262 వద్ద ట్రేడింగ్‌ను మొదలు పెట్టింది. తొలి రోజు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం నష్టంతో లోయర్‌ సర్క్యూట్‌ను రూ.248.90 వద్ద తాకింది. లిస్ట్ అయిన రెండో రోజు మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ 4.99 శాతం తగ్గి రూ.239.20 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని