SBIని దాటేసిన LIC.. ఆ జాబితాలో అగ్రస్థానంలోకి

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా అవతరించింది.

Published : 17 Jan 2024 20:37 IST

దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) మరో మైలురాయిని అందుకుంది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా అవతరించింది. ఈ విషయంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను (SBI) అధిగమించింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో తొలుత ఎల్‌ఐసీ షేర్లు 3 శాతం మేర ఎగబాకాయి. ఇంట్రాడేలో రూ.919.45 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరాయి. చివరికి 0.63 శాతం నష్టంతో రూ.886.90 వద్ద ముగిశాయి. అదే సమయంలో ఎస్‌బీఐ షేర్లు 1.67 శాతం నష్టంతో రూ.626.15 వద్ద ముగిశాయి. 

ఈ క్రమంలో మార్కెట్‌ విలువ పరంగా ఎస్‌బీఐని ఎల్‌ఐసీ అధిగమించింది. ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.5,60,964.05 కోట్లు కాగా.. ఎస్‌బీఐ మార్కెట్‌ విలువ రూ.5,58,814.58 కోట్లుగా నిలిచింది. రెండు అగ్రగామి సంస్థల మార్కెట్‌ విలువ మధ్య వ్యత్యాసం రూ.2,149.47 కోట్లు మాత్రమే. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే అత్యధిక విలువ కలిగిన కంపెనీల జాబితాలో ఎల్‌ఐసీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

టాప్‌ -10 కంపెనీలు ఇవే..

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ -  రూ.18,42,160.54 కోట్లు
  • టీసీఎస్‌ - రూ.14,21,230.44  కోట్లు
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ - రూ.11,66,888.98 కోట్లు
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ - రూ.6,87,740.99 కోట్లు
  • ఇన్ఫోసిస్‌ - రూ.6,80,631.89 కోట్లు
  • భారతీ ఎయిర్‌టెల్‌ - రూ.6,10,389.59 కోట్లు
  • హిందుస్థాన్‌ యూనిలీవర్‌ - రూ.6,02,388.21 కోట్లు
  • ఐటీసీ- రూ.5,82,423.61 కోట్లు
  • ఎల్‌ఐసీ- రూ.5,60,964.05 కోట్లు
  • ఎస్‌బీఐ - రూ.5,58,814.58 కోట్లు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని