LIC results: ఎల్‌ఐసీ నికర లాభం రూ.9,441 కోట్లు

LIC Q3 results: ఎల్‌ఐసీ మూడో త్రైమాసికంలో రూ.9,441 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధి నమోదైంది.

Published : 08 Feb 2024 21:54 IST

LIC Q3 results | దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,441 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.6,334 కోట్లతో పోలిస్తే లాభంలో 49 శాతం వృద్ధి నమోదైంది. నికర ప్రీమియం వసూళ్లు 4.67 శాతం వృద్ధితో రూ.1.17 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. మధ్యంతర డివిడెండ్‌ కింద ఒక్కో షేరుకు రూ.4 చొప్పున ఇచ్చేందుకు ఎల్‌ఐసీ బోర్డు నిర్ణయించింది.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో తొలి ప్రీమియం వసూళ్లు రూ.12,370 కోట్ల నుంచి రూ.13,163 కోట్లకు పెరిగాయి. ఎల్‌ఐసీ స్థూల ఎన్‌పీఏలు 5.02 శాతం నుంచి 2.15 శాతానికి తగ్గాయి. ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ 11.98 శాతం వృద్ధితో రూ.44.34 లక్షల కోట్ల నుంచి రూ.49.66 లక్షల కోట్లకు పెరిగింది. ఈసందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎల్‌ఐసీ ఛైర్మన్‌ సిద్ధార్థ్‌ మొహంతి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సంస్థ నుంచి మరిన్ని ఉత్పత్తులు రానున్నాయన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 5.86 శాతం లాభంతో రూ.1,106.25 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని