PhonePe: ‘ఫోన్‌ పే’లో డబ్బులు పంపిస్తే.. ఇకపై మహేశ్‌ వాయిస్‌!

PhonePe: యూజర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ప్రముఖ సంస్థలు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ‘ఫోన్‌ పే’ కూడా అలాంటి పనే చేసింది.

Updated : 21 Feb 2024 21:32 IST

PhonePe | ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో దాదాపు అన్ని దుకాణాల్లోనూ స్మార్ట్‌ స్పీకర్లు (smart speaker) కనిపిస్తున్నాయి. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో చేసే ప్రతి పేమెంట్‌ స్పీకర్‌ ద్వారా వినిపిస్తుంది. ఇకపై ‘ఫోన్‌ పే’ (PhonePe) ద్వారా చేసే చెల్లింపులకు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Mahesh Babu) వాయిస్‌ వినిపించనుంది.

యూజర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ‘ఫోన్‌ పే’ వినూత్న ప్రయత్నం చేసింది. గతేడాదిలో తన స్మార్ట్‌ స్పీకర్లకు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వాయిస్‌ని అందించిన కంపెనీ.. తెలుగులో అదే ఫీచర్‌కు మహేశ్‌బాబు వాయిస్‌ని జోడించింది. అంటే ఇకపై బిల్ పేమెంట్స్‌ సమయంలో.. మనీ రిసీవ్డ్ అంటూ సాధారణంగా వినిపించే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కాకుండా సూపర్‌స్టార్‌ గొంతు వినిపిస్తుంది.

చాట్‌జీపీటీ తరహాలో భారత్‌లో ‘హనుమాన్‌’ ఏఐ మోడల్‌!

ఇందుకోసం ఫోన్‌ పే సంస్థ ప్రతినిధులు మహేశ్‌ వాయిస్ తీసుకుని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ద్వారా వాయిస్ ని జెనరేట్ చేశారట. ఈ ప్రకటనకు సంబంధించి చిత్రీకరించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత ‘ధన్యవాదాలు బాస్‌’ అంటూ వినిపిస్తుందని తెలుస్తోంది. బిగ్‌బీ, సూపర్‌స్టార్‌ మాత్రమే కాకుండా.. మలయాళం కోసం మమ్ముట్టి, కన్నడ కోసం సుదీప్‌తో కలసి ‘ఫోన్‌ పే’ పనిచేయనుందని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని