Motisons Jewellers IPO: 18న మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.52-55

Motisons Jewellers IPO: గరిష్ఠ ధర వద్ద మోతీసన్స్‌ జువెలర్స్‌ రూ.151 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 12 Dec 2023 13:55 IST

Motisons Jewellers IPO | దిల్లీ: జయపురకు చెందిన రిటైల్‌ ఆభరణాల కంపెనీ మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓ డిసెంబర్‌ 18న ప్రారంభం కానుంది. 20వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఐపీఓ (Motisons Jewellers IPO)లో షేరు ధరల శ్రేణిని రూ.52-55గా నిర్ణయిస్తూ కంపెనీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

ఈ ఐపీఓ (Motisons Jewellers IPO)లో మొత్తం 2.74 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లను విక్రయించడం లేదు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.151 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను రుణ చెల్లింపులు, నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నారు.

ఇన్వెస్టర్లు కనీసం 250 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కనీసం రూ.13,750 పెట్టుబడిగా పెట్టాలి. ప్రీ-ఐపీఓ ఫండింగ్‌ రౌండ్‌లో ఈ కంపెనీ ఇప్పటికే రూ.33 కోట్లు సమీకరించింది. హొలానీ కన్సల్టెంట్స్‌ ఈ ఐపీఓ (Motisons Jewellers IPO)కి బుక్‌ రన్నింగ్‌ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. కంపెనీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదు చేయాలని యోచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని