Netflix: నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారాల్లో అంతరాయం!

Netflix: ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారాలను వీక్షించలేకపోతున్నారని డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. 

Published : 02 Mar 2023 13:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ప్రసారాలను వీక్షించలేకపోతున్నారని ఔటేజ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌.కామ్‌ వెల్లడించింది. దాదాపు 55 శాతం మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)తో సమస్య ఎదుర్కొంటున్నట్లు అంచనా వేసింది. దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix).. ఓటీటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని