డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈఓ.. ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌...

Zomato CEO: జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్ స్నేహితుల దినోత్సవాన్ని వినూత్నంగా చేసుకొన్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated : 06 Aug 2023 14:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జొమాటో సీఈఓ (Zomato) దీపిందర్‌ గోయల్ (Deepinder Goyal) ఫ్రెండ్‌షిప్ డే (Friendship Day)ని వినూత్నంగా చేసుకొన్నారు. ఎంచక్కా సాధారణ డెలివరీ బాయ్‌ వలే రెడ్‌ టీ షర్ట్‌ ధరించి.. బైక్‌పై ఫుడ్‌ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

జొమాటో సీఈఓ రాయల్‌ ఎన్ఫీల్డ్‌ బైక్‌పై టీ షర్టు ధరించి కస్టమర్లకు ఆహారం అందిచటానికి బయల్దేరారు. అతని చేతిలో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు కూడా ఉన్నాయి. డెలివరీ పార్ట్‌నర్లు, కస్టమర్లు, రెస్టారెంట్‌ పార్ట్‌నర్లకు కూడా ఈ బ్యాండ్లు అందించనున్నారు. కంపెనీతో అనుబంధం ఉన్న వ్యక్తులతో కలిసి ఈ రోజు ఆయన ‘స్నేహితుల దినోత్సవాన్ని’ చేసుకోనున్నారు.

అమెరికాలో మాంద్యం లేనట్లే.. ఈ ఏడాదిలో అవకాశాల్లేవ్‌

‘రెస్టారెంట్లు, వినియోగదారులకు ఆహారంతో పాటూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను అందించబోతున్నాం. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సీఈఓను పొగొడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘ఇది బెస్ట్‌ ఫ్రెండ్‌షిప్‌ డే సంబరాలు’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు