US recession: అమెరికాలో మాంద్యం లేనట్లే.. ఈ ఏడాదిలో అవకాశాల్లేవ్‌

అమెరికాలో ఈ ఏడాదిలో మాంద్యం కనిపించే అవకాశాలు లేవని జేపీ మోర్గాన్‌ అంచనా వేస్తోంది. 2023లో మాంద్యం పరిస్థితులు కనిపించొచ్చని ఈ కంపెనీకి చెందిన ముఖ్య ఆర్థికవేత్త ఒకరు గతంలో తన నివేదికలో పేర్కొన్నారు.

Updated : 06 Aug 2023 08:07 IST

జేపీ మోర్గాన్‌ అంచనాలు

దిల్లీ: అమెరికాలో ఈ ఏడాదిలో మాంద్యం(US recession) కనిపించే అవకాశాలు లేవని జేపీ మోర్గాన్‌(JP morgan) అంచనా వేస్తోంది. 2023లో మాంద్యం పరిస్థితులు కనిపించొచ్చని ఈ కంపెనీకి చెందిన ముఖ్య ఆర్థికవేత్త ఒకరు గతంలో తన నివేదికలో పేర్కొన్నారు. అయితే తాజా నివేదికలో మాత్రం దానిని సవరించారు. ప్రస్తుతానికి అమెరికా ఆర్థికం ఆరోగ్యంగానే ఉందన్నారు. ఉత్పాదకత పెరగడం దానికి కారణంగా అభివర్ణించారు. రుణ పరిమితికి కాంగ్రెస్‌లో అడ్డంకులు ఎదురుకావడం, బ్యాంకింగ్‌ సంక్షోభాల నేపథ్యంలో గతంలో ఆ అంచనాలకు వచ్చినట్లు తెలిపారు. అయితే తాజాగా వాటిని పక్కనపెడుతూ మూడో త్రైమాసిక వృద్ధి అంచనాలను 0.5 శాతం నుంచి 2.5 శాతానికి పెంచారు. రుణ పరిమితికి ఉన్న సమస్యలు తొలగడం, ఉత్పాదకత రాణించడం ఇందుకు దోహదం చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే మాంద్యం ముప్పు ప్రస్తుతానికి లేకున్నా.. పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేమని అన్నారు. ఇంకా ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకు లక్ష్యమైన 2 శాతం కంటే పైనే ఉందని.. ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచకుంటే.. మాంద్యం పరిస్థితులు ఎపుడైనా తలెత్తే ప్రమాదం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని