MoRTH: రోడ్డు ప్రమాదాల నివారణకు ఇకపై వాహనాల్లో హెచ్చరిక వ్యవస్థ

MoRTH: రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల్లో కొత్త సిగ్నలింగ్‌ సిస్టమ్‌ ఉండేలా తాజా ప్రతిపాదనను తీసుకొచ్చింది.

Published : 11 Nov 2023 15:24 IST

దిల్లీ: రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) మరో అడుగు ముందుకు వేసింది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, సైక్లిస్ట్‌లను వాహనాలు ఢీ కొట్టకుండా సహాయపడే వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇన్‌బిల్ట్‌ ‘మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్' (MOIS) సిస్టమ్‌లను కొన్ని కేటగిరీలకు చెందిన ప్రయాణికుల, వాణిజ్య వాహనాల్లో ఉండేలా ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇది అమలులోకి వస్తే వాహన తయారీ సంస్థలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MOIS) అంటే.. పాదచారులు, సైక్లిళ్లపై వెళ్లే వారికి (VRU) వాహనం సమీపంలోకి వస్తే ఈ సిస్టమ్‌ వారిని గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని డ్రైవర్‌కు తెలియజేస్తుంది. ఏదైనా అత్యవసరం అనుకుంటే వెంటనే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. ఇలా MOIS అందించే సిగ్నల్‌నే కొలిషన్ వార్నింగ్ సిగ్నల్ అంటారు. చీకట్లో క్లిష్టమైన రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు అటుగా పాదచారులు, సైకిళ్లపై వెళ్లే వారిని వాహనం ఢీకొట్టకుండా సిస్టమ్‌ వెంటనే గుర్తించి సమాచారం అందిస్తుంది. దీంతో డ్రైవర్‌ వెంటనే జాగ్రత్త పడతారు. దీంతో ప్రమాదాలు సంభవించే అవకాశం తగ్గుతుంది.

కార్తీక మాసంలో ₹21 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. IRCTC ప్యాకేజీ వివరాలివే..!

ఈ వ్యవస్థను  ప్రయాణికుల, వాణిజ్య వాహనాల్లో తీసుకురావాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ చూస్తోంది. దీని ద్వారా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వాహనకంపెనీలు, ఇతర వర్గాలతో సంప్రదించిన తర్వాత ఈ విధానాన్ని తీసుకురానుంది. గతేడాదిలో భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 12 శాతం పెరిగాయి. అంటే ప్రతి గంటకు సగటున 19 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఈ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు