India GDP: భారత జీడీపీ అంచనాల్లో ఎస్‌ అండ్‌ పీ కోత

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో ప్రమముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (S&P) కోత పెట్టింది. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ 7 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని అంచనా వేసింది.

Published : 28 Nov 2022 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత జీడీపీ వృద్ధి రేటు (India GDP) అంచనాల్లో ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (S&P) కోత పెట్టింది. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ 7 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని అంచనా వేసింది. గతంలో భారత వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండొచ్చని పేర్కొన్న ఆ సంస్థ.. తాజా అంచనాల్లో 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.

2024 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను సైతం రేటింగ్‌ సంస్థ తగ్గించింది. ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6 శాతం వృద్ధి రేటు నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ ఏడాది చివరి వరకు దేశ ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎగువనే ఉంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్త పరిణామాల కారణంగా ఆసియా పసిఫిక్‌ దేశాల సెంట్రల్‌ బ్యాంకులపై ఒత్తిడి  కొనసాగుతుందని అంచనా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని