Vivo mobiles: 50MP సెల్ఫీ కెమెరాతో వీవో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే..!

Vivo V29, Vivo V29 Pro: మొబైల్‌ తయారీ కంపెనీ వివో తన వీ29 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వాటి ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Published : 04 Oct 2023 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ తయారీ కంపెనీ వివో (Vivo) రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీవో వీ29 (Vivo V29), వీవో వీ29 ప్రో (Vivo V29 Pro) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ల ప్రీ బుకింగ్‌లు అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌తో పాటూ ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అక్టోబర్‌ 10 నుంచి ఇవి విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

వీవో వీ29 (Vivo V29) రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ + 128 జీబీ వేరియంట్‌ ధర రూ.32,999 కాగా, 12జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ.36,999. హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్.. ఈ మూడు రంగుల్లో ఫోన్లు లభిస్తాయి. ఇక వీవో వీ29 ప్రో (Vivo V29 Pro)కూడా రెండు వేరియంట్లలో లభించనుంది. 8జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ.39,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.42,999. ఈ ఫోన్‌ హిమాలయన్‌ బ్లూ, స్పేస్‌ బ్లాక్‌.. ఈ రెండు రంగుల్లో మాత్రమే లభిస్తుంది.

మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. వీవో వీ26 ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. దీని రీఫ్రెష్‌ రేటు 120Hz. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్‌తో వస్తున్నాయి. ఈ ఫోన్‌కు 4,600mAh బ్యాటరీని ఇచ్చారు. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ని సపోర్ట్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరాకు 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ మోనోక్రోమ్‌ సెన్సర్‌లు ఇచ్చారు. సెల్ఫీ, వీడియోకాల్స్‌ కోసం ముందువైపు 50 ఎంపీ కెమెరా ఇచ్చారు.

వీవో వీ29 ప్రోలోనూ దాదాపు ఇవే ఫీచర్లు ఉన్నాయి. అయితే ప్రాసెసర్‌ మాత్రం వేరుగా ఉంది. ఇందులో మీడియా టెక్‌ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే.. ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ పోట్రెయిట్‌ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైల్డ్ యాంగిల్‌ లెన్స్‌ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని