Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!

Meta: మెటా (Meta) మరోసారి లేఆఫ్‌లు విధించేందుకు సిద్ధమైంది.

Published : 04 Oct 2023 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌ (Facebook) మాతృసంస్థ మెటా  (Meta) మరింత మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సారి మెటావర్స్‌ విభాగంలో పనిచేస్తున్న వారికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన కంపెనీ అంతర్గత  సమావేశాల్లో ఉద్యోగాల కోత గురించి చర్చించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. బుధవారం నాటికి సదరు ఉద్యోగులకు ఆ సమాచారాన్ని అందజేస్తారని సమాచారం.

మెటాకు చెందిన ఫాస్ట్‌ (FAST) యూనిట్‌లో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులపై ఈ లేఆఫ్‌ ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. మెటా గత కొంతకాలంగా చిప్‌ల తయారీ విభాగంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీని కోసం చిప్‌మేకర్‌ అయిన క్వాల్కమ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తమ ఫాస్ట్‌ యూనిట్‌ని పునర్నిర్మించడంలో భాగంగానే ఉద్యోగుల సంఖ్యలో కోత విధించనున్నట్లు సమాచారం. అయితే తాజా లేఆఫ్‌ల విషయాన్ని మెటా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

పండగ సేల్‌లో ఫోన్‌ కొంటున్నారా? మంచి ఫోన్‌ ఎలా ఎంచుకోవాలంటే..

గతేడాది నవంబర్‌ నుంచి ఇప్పటివరకు మెటా అనేక దఫాలుగా లేఆఫ్‌లు ప్రకటించింది. ఇప్పటివరకు 21 వేల మందిని సంస్థ నుంచి తొలగించింది. తగ్గుతున్న ఆదాయ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, రియాలిటీ ల్యాబ్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవటానికే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు కొనసాగే అవకాశం ఉందని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని