WhatsApp: వాట్సాప్‌లో మరో ఫీచర్‌.. ఒకే యాప్‌లో వేర్వేరు అకౌంట్లు!

WhatsApp-multi account: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ రాబోతోంది. ఒకేసారి వేర్వేరు అకౌంట్లను వాడుకునే సదుపాయం రానుంది. ప్రస్తుతం ఇది డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉంది.

Published : 16 Jun 2023 01:36 IST

WhatsApp New feature | ఇంటర్నెట్‌ డెస్క్‌: మన ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులున్నా.. ఆ రెండు నంబర్లతో ఒకేసారి వాట్సాప్‌ (WhatsApp) వాడలేం. ఒకవేళ అలా వాడాలంటే అయితే, క్లోనింగ్‌ యాప్‌ లేదంటే బిజినెస్‌ యాప్‌ వాడాల్సిందే. అలా కాకుండా వేర్వేరు అకౌంట్లను ఒకే యాప్‌లో వాడుకునే వీలుంటే ఎంత బాగుంటుందో కదూ! సరిగ్గా వాట్సాప్‌ సైతం అదే చేస్తోంది. ఒకటే యాప్‌లో వేర్వేరు అకౌంట్లు (multi account) వాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తోంది.

వాట్సాప్‌ తాజాగా విడుదల చేసిన ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.23.13.5లో ఈ ఫీచర్‌ కనిపించింది. వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫీచర్‌.. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లో కనిపించింది. రెగ్యులర్‌ యాప్‌లో సైతం తీసుకొచ్చే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.

ఇక ఈ ఫీచర్‌ విషయానికొస్తే.. ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల కోసం ఒక వాట్సాప్‌ అకౌంట్‌, ఆఫీసు అవసరాలకు మరో అకౌంట్‌ వాడుతున్నారనుకుందాం. ప్రస్తుతానికి ఇలా రెండు వేర్వేరు అకౌంట్లు వాడాలంటే క్లోనింగ్‌ యాప్‌ తప్పనిసరి. అదే వాట్సాప్‌ తీసుకురాబోయే ఫీచర్‌ ద్వారా సింగిల్‌ క్లిక్‌తో అకౌంట్ల మధ్య స్విచ్‌ అవ్వొచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ను మారిస్తే మీకు కావాల్సిన అకౌంట్‌తో వాట్సాప్‌ను ఉపయోగించొచ్చు. వాబీటా ఇన్ఫో షేర్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ను బట్టి రెండు కంటే ఎక్కువ అకౌంట్లు వాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు