Xiaomi 14: షావోమీ నుంచి రెండు ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే!

షావోమీ 14 (Xiaomi 14), షావోమీ 14 అల్ట్రా (Xiaomi 14 Ultra) పేరుతో రెండు ఫోన్లను తీసుకొచ్చింది.

Published : 07 Mar 2024 21:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమీ (Xiaomi) రెండు ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. షావోమీ 14 (Xiaomi 14), షావోమీ 14 అల్ట్రా (Xiaomi 14 Ultra) పేరుతో రెండు ఫోన్లను తీసుకొచ్చింది. కేవలం షావోమీ 14 ఫోన్‌ను మాత్రమే భారత్‌కు తీసుకొస్తారని ప్రచారం జరిగింది. అయితే, 14తో పాటు అల్ట్రాను కూడా లాంచ్‌ చేసి టెక్‌ ప్రియులను షావోమీ సర్‌ప్రైజ్‌ చేసింది. కెమెరాలు, లెన్సులు తయారుచేసే జర్మన్‌ కంపెనీ లైకాతో (Leica)తో కలిసి ఈ ఫోన్లను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ల ధరెంత? ఫీచర్లేంటో చూద్దాం.. 

షావోమీ 14 స్పెసిఫికేషన్స్ (Xiaomi 14)

షావోమీ 14 స్మార్ట్‌ఫోన్‌ 6.36 అంగుళాల 1.5K ఓఎల్‌ఈడీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటు ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో పనిచేస్తుంది. డ్యూయల్‌ సిమ్‌ కార్డు ఉంది. వెనుక వైపు 50 ఎంపీ ఓఐఎస్‌ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్‌ను అమర్చారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 4,610 ఎంఏహెచ్‌ బ్యాటరీ 90W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 50W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. ఐపీ68 రేటింగ్‌, వైఫై 7, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్‌ 5.4, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ అమర్చారు. 12జీబీ+ 512జీబీ వేరియంట్‌ ధర రూ.69,999గా కంపెనీ నిర్ణయించింది. వైట్‌, గ్రీన్‌, బ్లాక్‌ కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌స్టోర్లతో పాటు రిటైల్‌ దుకాణాల్లో మార్చి 11 నుంచి లభ్యం కానుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లకు రూ.5 వేలు డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

షావోమీ 14 అల్ట్రా (Xiaomi 14 Ultra)

షావోమీ అల్ట్రా 14 స్మార్ట్‌ఫోన్‌ 6.73 అంగుళాల డిస్‌ప్లే 2కె డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులోనూ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 హైపర్‌ ఓఎస్‌తో వస్తోంది. వెనుక వైపు మొత్తం నాలుగు కెమెరాలు అమర్చారు. 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన సోనీ సెన్సర్‌, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్‌ లెన్స్‌, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్‌ ఇచ్చారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 90W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు, 80W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. NFC, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, ఐపీ 68 రేటింగ్‌ కలిగి ఉంది. 16జీబీ+512 జీబీ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, వైట్‌ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్‌ 8న విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 11 నుంచి ప్రీ రిజర్వ్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని