Zomato: మహిళా ఉద్యోగులకు జొమాటో కొత్త యూనిఫాం.. నెట్టింట ప్రశంసలు

Zomato: ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు కొత్త యూనిఫాం అందించింది. దీనిపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తాయి.

Published : 09 Mar 2024 15:36 IST

Zomato | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వినూత్నంగా జరిపింది. తన సంస్థలో పనిచేసే డెలివరీ విమెన్‌కు కొత్త యూనిఫాం అందించింది. ఎరుపు రంగు కుర్తాలు అందిస్తూ.. ఇకపై యూనిఫాంలో భాగంగా కచ్చితంగా టీ-షర్ట్‌ ధరించాలనే నియమం లేదని తెలిపింది. సౌకర్యంగా ఉంటేనే టీ-షర్ట్‌ లేకపోతే కుర్తాను ఎంచుకోవచ్చని వెల్లడించింది.

‘‘జొమాటో టీ-షర్ట్‌లు ధరించడంపై చాలామంది మహిళా డెలివరీ ఉద్యోగులు అసౌకర్యాన్ని వ్యక్తంచేశారు. మహిళా ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా టీ-షర్ట్‌ మాత్రమే కాకుండా కుర్తాలను ఎంచుకొనే సదుపాయం కల్పించాం’’ అని జొమాటో తన లింక్డిన్‌ పోస్ట్‌లో తెలిపింది. జొమాటో అందించిన కొత్త యూనిఫాంపై మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. కంపెనీ కొత్త ఆలోచనకు కృతజ్ఞత తెలిపారు. కుర్తాలను ధరించి అందంగా ముస్తాబై జొమాటో నిర్వహించిన ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

మన విమానం ఆకర్షణీయం

‘‘ఈ రోజు నుంచి జొమాటో మహిళా ఉద్యోగులు కుర్తానూ ధరించొచ్చు’’ అంటూ క్యాప్షన్ జోడించింది. జొమాటో పంచుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తక్కువ సమయంలోనే మిలియన్ల మంది దీన్ని వీక్షించారు. వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జొమాటో తన ఉద్యోగుల కోసం తీసుకున్న ఆలోచనాత్మక చర్యను పలువురు కొనియాడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని