Zomato: జొమాటోకు పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌

Zomato gets PA licence: ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ అందుకుంది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది.

Published : 25 Jan 2024 17:56 IST

Zomato | ముంబయి: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato)కు పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ అందుకుంది. జొమాటో అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నుంచి సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఆథరైజేషన్‌ అందుకున్నట్లు తన రెగ్యులేటరీలో ఫైలింగ్‌లో తెలిపింది. 2021 ఆగస్టు 4న జొమాటో పేమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను నెలకొల్పింది.

: ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్‌.. నేటి నుంచే అమల్లోకి

ఏదైనా సంస్థ డిజిటల్‌ చెల్లింపులను నిర్వహించాలంటే పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ తప్పనిసరి. దీనిద్వారా ఇ- కామర్స్‌ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్స్‌, మర్చంట్స్‌ కస్టమర్ల నుంచి లావాదేవీలు నిర్వహించొచ్చు. అలాగే వ్యాలెట్‌లను జారీ చేయొచ్చు. ఈ లైసెన్స్‌ పొందడం ద్వారా గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా మర్చంట్‌ ఛార్జీలు జొమాటోకు మిగులుతాయి. ఇప్పటికే టాటా పే, రేజేర్‌పే, క్యాష్‌ఫ్రీ వంటి సంస్థలు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ నుంచి అందుకున్నాయి. మరోవైపు జొమాటో పే పేరుతో సొంత యూపీఐని అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు