భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు

Published : 24 Sep 2020 00:57 IST

ముగ్గురు మావోయిస్టులు మృతి

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు- మావోయిస్టుల కాల్పులు మధ్య జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ప్రకటించారు. ఘటనాస్థలంలో పరిశీలించగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో 8 ఎంఎం రైఫిల్‌, బ్లాస్టింగ్‌కు ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని