బాలుడిని చిదిమేసిన లిఫ్టు‌ గ్రిల్స్‌

ముంబయిలోని ధారావిలో విషాదం చోటుచేసుకుంది. కోజీ షెల్టర్‌ భవనంలో ఐదేళ్ల బాలుడు లిఫ్టు గ్రిల్స్‌ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు.

Published : 29 Nov 2020 11:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయిలోని ధారావిలో విషాదం చోటుచేసుకుంది. కోజీ షెల్టర్‌ భవనంలో ఐదేళ్ల బాలుడు లిఫ్టు గ్రిల్స్‌ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇతర పిల్లలతో కలిసి కింది అంతస్తుకు వెళ్లేందుకు మహమ్మద్‌ హుజైఫ్‌ సర్ఫరాజ్‌ షేక్‌ అనే బాలుడు లిఫ్టు‌ ఎక్కాడు. ఆ లిఫ్టు‌కు గ్రిల్స్‌తోపాటు దాని వెనక డోర్‌ కూడా ఉంది. గ్రిల్స్‌తోపాటు తలుపు మూసుకోగానే లిఫ్టు‌ కదులుతుంది. అయితే లిఫ్టు కింది అంతస్తుకు చేరుకోగానే మిగతా ఇద్దరు పిల్లలు గ్రిల్స్‌, డోర్‌ తెరుచుకొని బయటకు వెళ్లిపోయారు. చివరలో లిఫ్టు‌లో నుంచి బయటకు వచ్చిన సర్ఫరాజ్‌ గ్రిల్స్‌ మూసివేస్తున్న క్రమంలోనే వెనక ఉన్న తలుపు మూసుకుపోయింది. ఆ మధ్యలోనే ఉండిపోయిన బాలుడికి ఎలా బయటకు వెళ్లాలో తోచలేదు. ఈలోపే మరొకరు లిఫ్టు‌ బటన్‌ నొక్కడంతో అది కిందకు కదిలింది. మధ్యలోనే ఉండిపోయిన బాలుడు లిఫ్టు గ్రిల్స్‌ ‌ మధ్యే నలిగిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ మొత్తం ఘటన సీసీ టీవీలో నమోదైంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని