పెదకాకానిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌

గుంటూరు జిల్లా పెద్దకాకాని మండల పరిధిలోని ఎస్టీ కాలనీలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌కి గురయ్యాడు. తమ ఇంటి సమీపంలోని ఓ మర్రి చెట్టు వద్దకు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే తమ చిన్నారిని అపహరించి ఉంటారని ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు..

Published : 25 Feb 2021 01:18 IST

పెదకాకాని: గుంటూరు జిల్లా పెద్దకాకాని మండల పరిధిలోని ఎస్టీ కాలనీలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌కి గురయ్యాడు. తమ ఇంటి సమీపంలోని ఓ మర్రి చెట్టు వద్దకు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే తమ చిన్నారిని అపహరించి ఉంటారని ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కాలనీకి చెందిన బాల, ముసలయ్య దంపతులకు రెండేళ్ల బాలుడు జీవా ఉన్నాడు. బుధవారం సాయంత్రం 5గంటల సమయంలో ఇంటి సమీపంలోని ఓ మర్రి చెట్టు వద్దకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. అందులోని ఓ వ్యక్తి మంచి నీళ్లు కావాలని బాలుడి తల్లిని కోరారు. ఇంతలో అక్కడే ఆడుకుంటున్న బాలుడిని వదిలి ఆమె అతని వద్ద ఉన్న బాటిల్‌ను తీసుకొని ఇంట్లోకి వెళ్లింది. అనంతరం బయటికి వచ్చి చూసేసరికి బాలుడు, కారులో వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు కన్పించకుండా పోయారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ శోభన్‌ బాబు.. సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts