గొంతులో విత్తనం ఇరుక్కుని బాలిక మృతి

లిచీ పండు విత్తనం గొంతులో ఇరుక్కుని 16 ఏళ్ల బాలిక మరణించిన సంఘటన అస్సాంలో చోటుచేసుకుంది.

Published : 01 Jun 2021 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లిచీ పండు విత్తనం గొంతులో ఇరుక్కుని 16 ఏళ్ల బాలిక మరణించిన సంఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోర్హాట్‌ జిల్లా, కాకాజన్‌ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. కానిస్టేబుల్‌గా పనిచేసే బాలిక తండ్రి ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు లిచీ పళ్లను తీసుకొచ్చారు. వాటిని తిన్న బాలిక కొంత సేపటికే నేల కూలింది. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుమారు రెండు అంగుళాల పొడవు ఉండే లిచీ పండు విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక బాలిక మరణించిందని వారు స్పష్టం చేశారు. కూతురి ఆకస్మిక మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని