ఆ యాప్‌లకు చైనా, సింగపూర్‌ నుంచి నిధులు?

ఆన్‌లైన్‌ రుణ యాప్‌లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని సైబరాబాద్‌ సీసీ సజ్జనార్‌ తెలిపారు.

Published : 26 Dec 2020 02:54 IST

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ రుణ యాప్‌లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని సైబరాబాద్‌ సీసీ సజ్జనార్‌ తెలిపారు. రుణయాప్‌లకు సంబంధించిన కేసులో నిన్న మరో నలుగురిని అరెస్టు చేసినట్టు సీపీ వెల్లడించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్‌ మాట్లా డారు.

‘‘స్థానికులతో కలిసి చైనా వాసి రెండు డిజిటల్‌ కంపెనీలు ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేశారు. మరో చైనా వాసి ఫిబ్రవరిలో వ్యాపార వీసాపై హైదరాబాద్‌ వచ్చి దందాలో పాల్గొన్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. మొత్తం 11 యాప్‌లు సృష్టించి రుణాలు ఇచ్చారు. ప్రత్యేకంగా 40 ఏళ్ల లోపు  ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని రుణాలిచ్చారు. 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేస్తూ... చెల్లింపులు ఆలస్యమైతే జరిమానా విధించే వారు. ఆన్‌లైన్‌ రుణాల వ్యాపారానికి నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం.  చైనా, సింగపూర్‌ ఇతర దేశాల నుంచి నిధులు వచ్చాయా అనే అంశంపై కూడా విచారణ చేపట్టాం. కీలకపాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నారు. ఈ యాప్‌లకు ఎన్‌బీఎఫ్‌సీలతో సంబంధం లేదు. ఈ వ్యవహారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లాం. ప్రజలెవరూ ఆన్‌లైన్‌ రుణాల వలలో చిక్కుకోవద్దు. రుణాల యాప్‌లే కాకుండా ఆటల యాప్‌ల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. యాప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్‌ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్‌ చేయొద్దు. యాప్‌ల ద్వారా మోసపోయిన వారు ధైర్యంగా ఫిర్యాదు చేయండి. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు. యాప్‌ల దర్యాప్తులో రోజు రోజుకూ కొత్త అంశాలు బయటపడుతున్నాయి’’ అని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

ఇవీ చదవండి...
కారం చల్లారు.. పెట్రోలుతో అడ్డుకున్నారు

పెళ్లికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని