Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి

24 గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందిన విషాద ఘటన నెల్లూరు జిల్లా నరుకూరు గ్రామంలో చోటు చేసుకుంది.

Updated : 31 May 2023 21:37 IST

తోటపల్లి గూడూరు: భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. 24 గంటలైనా గడవకముందే కట్టుకున్నవాడిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా  తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో బుధవారం జరిగింది. అనారోగ్య కారణంగా భార్యాభర్తలు ఒకేరోజున మృతి చెందడం గ్రామస్థులను కలచివేసింది.

నరుకూరు గ్రామానికి చెందిన రమణ(40), సుమలత(36) భార్యాభర్తలు. కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం చికిత్స నిమిత్తం రమణను కుటుంబ సభ్యులు చెన్నై తరలించారు. ఆ తర్వాత మళ్లీ నిన్న ఉదయం చెన్నై నుంచి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. భర్త చికిత్స పొందుతున్న సమయంలో భార్య సుమలత కూడా అనారోగ్యానికి గురవడంతో ఆమె చెన్నైలో చికిత్స పొందుతోంది. రమణ బుధవారం ఉదయం నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భర్త అంత్యక్రియలు పూర్తయిన కొన్ని గంటల వ్యవధిలోనే సుమలత చెన్నైలోని ఆసుపత్రిలో మృతి చెందారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు