Crime news: గచ్చిబౌలిలో ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

గోపన్‌పల్లి ప్రాంతంలో ఈ నెల 11న వెలుగు చూసిన మేస్త్రీ శేఖర్‌ హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి

Updated : 15 Oct 2021 09:22 IST

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: గోపన్‌పల్లి ప్రాంతంలో ఈ నెల 11న వెలుగు చూసిన మేస్త్రీ శేఖర్‌ హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్యే.. భర్తను హత్య చేయించినట్లు తేలింది. దీంతో మృతుడి భార్యతోపాటు అతని ప్రియుడిని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్‌ శేఖర్‌ (30)కు అదే ప్రాంతానికి చెందిన ముడావత్‌ జ్యోతి (26)కు పదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల క్రితం గచ్చిబౌలి గోపన్‌పల్లి తండాకు వలస వచ్చారు. శేఖర్‌ మేస్త్రీ పనిచేస్తుండగా జ్యోతి కూలి పనిచేస్తుండేది. రామచంద్రాపురం ఉస్మాన్‌ నగర్‌కు దుడ్డెల మాణిక్యం(42) తెల్లాపూర్‌కు చెందిన రాజీవ్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

రాజీవ్‌రెడ్డి ఇటీవల తెల్లాపూర్‌లో రెండు విల్లాలు కొనుగోలు చేశాడు. అందులో పనుల కోసం శేఖర్‌ దంపతులు వెళ్లడంతో మాణిక్యంకు వారితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతను శేఖర్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. శేఖర్‌ తరుచూ తనను కొడుతుండటంతో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన జ్యోతి ప్రియుడితో కలిసి అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 10న సాయంత్రం 6 గంటలకు శేఖర్‌కు ఫోన్‌ చేసి మద్యం తాగేందుకు ఆహ్వానించాడు. పురుగు మందు కలిపిన మద్యాన్ని తాగించి గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా నిందితుడితోపాటు మృతుడి భార్యను రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని