Andhra News: నాన్న కాదు.. నరరూప రాక్షసుడు

కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి మానవ మృగంలా మారాడు. బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. వావి వరసలు మరచి అభం శుభం తెలియని ఆ చిట్టితల్లికి నరకం చూపాడు.

Published : 26 Apr 2022 09:21 IST

ఐదేళ్ల కూతురిపై తరచూ తండ్రి అత్యాచారం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి మానవ మృగంలా మారాడు. బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. వావి వరసలు మరచి అభం శుభం తెలియని ఆ చిట్టితల్లికి నరకం చూపాడు. తరచూ అత్యాచారానికి పాల్పడుతూ.. పసిమనసులో చెరగని గాయం చేశాడు. ఆదివారం రాత్రి ఇలాగే చేస్తూ... భార్య నిఘా పెట్టగా పట్టుబడ్డాడు. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఇది జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2016లో ఓ యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. భర్త బొప్పూడిలో ఉంటూ చిలకలూరిపేటలో ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. కుమార్తె ఓ పాఠశాలలో చదువుతోంది. చిన్నారికి తల్లి స్నానం చేయించేటప్పుడు తనకు మర్మాంగం వద్ద నొప్పిగా ఉంటోందని.. రాత్రిపూట నాన్న వద్ద పడుకోపెట్టవద్దని ఏడుస్తూ చెప్పేది. చిన్నారి మాటలతో ఆలోచనలో పడ్డ తల్లి తన భర్తపై నిఘా ఉంచింది.

అనుకున్నదే నిజమైంది.. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి నలుగురు నిద్రకు ఉపక్రమించారు. అంతలోనే భర్త బయటకు వెళ్లి వస్తానని చెప్పి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య నిద్రపోతున్నట్లు నటించింది. భార్య నిద్రపోతోందా.. లేదా అని భర్త సెల్‌ఫోన్‌ లైటు వేసి చూశాడు. నిద్రపోతోందని భావించి కుమార్తె పక్కన పడుకుని సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూస్తూ కూతురిపై అత్యాచారయత్నం చేస్తుండగా భార్య వెంటనే అతన్ని పట్టుకుంది. బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షలకు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని