క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన టి-20 మూడో మ్యాచ్‌పై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను మహబూబ్‌నగర్‌ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారిని సోమవారం

Updated : 27 Sep 2022 04:30 IST

వివరాలను వెల్లడిస్తున్న సీఐ స్వామిగౌడ్‌

మహబూబ్‌నగర్‌ నేర విభాగం : ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన టి-20 మూడో మ్యాచ్‌పై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను మహబూబ్‌నగర్‌ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారిని సోమవారం మొదటి పట్టణ ఠాణాలో చూపి వివరాలను వెల్లడించారు. సీఐ స్వామిగౌడ్‌ కథనం  ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సారిక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో అన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ముఖ్యమైన వ్యక్తి తాహేర్‌ తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన వారి నుంచి 9 చరవాణులు, రూ.15,900ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రామస్వామి, వినయ్‌కుమార్‌, శ్రీకాంత్‌, అనిల్‌, శ్రీనివాసులు, రవి, శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు. ఆస్ట్రేలియా-ఇండియా టి-20 మొదటి మ్యాచ్‌ నుంచే పోలీసులు బెట్టింగ్‌ నిర్వాహకులపై దృష్టి పెట్టి పట్టుకున్నారు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఎస్‌ఐ బాలకృష్ణగౌడ్‌, హెచ్‌సీ శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుళ్లు పవన్‌, నాగరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని