బెంగళూరులో నకిలీ మార్కుల కార్డుల ముఠా

వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన నకిలీ మార్కుల జాబితాలను తయారు చేసి విక్రయిస్తున్న ఐదు సంస్థల్లో శుక్రవారం సోదాలు చేసి బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం అధికారులు నలుగురిని అరెస్టు చేశారు.

Updated : 28 Jan 2023 06:09 IST

బెంగళూర్‌, న్యూస్‌టుడే: వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన నకిలీ మార్కుల జాబితాలను తయారు చేసి విక్రయిస్తున్న ఐదు సంస్థల్లో శుక్రవారం సోదాలు చేసి బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి  6,846కు పైగా నకిలీ మార్కుల జాబితాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను బెంగళూరు కొత్వాలు ప్రతాప్‌రెడ్డి విలేకరులకు వివరించారు. ఇక్కడి క్రైస్ట్‌ టెక్నాలజీస్‌, జేపీ నగరలోని సిస్టమ్‌ క్వెస్ట్‌, భద్రప్ప లేఅవుట్లోని ఆరోహి ఇన్‌స్టిట్యూట్, దాసరహళ్లి విశ్వజ్యోతి కళాశాల, విజయనగర బెనకా కరస్పాండెన్స్‌ కళాశాలల్లో సోదాలు చేసి నకిలీ మార్కుల జాబితాలను గుర్తించామని అన్నారు. అణ్ణామలై, సిక్కిం, గీతం, కువెంపు, జైన్‌విహార్‌, మంగళూరు, బెంగళూరు తదితర 15 విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ మార్కుల జాబితాలు వీరి వద్ద లభించాయని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు