లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విదేశీ వర్తక కార్యాలయ అధికారి ఆత్మహత్య

విదేశీ వర్తక వ్యవహారాలను పర్యవేక్షించే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) సీనియర్‌ అధికారి జవరీమల్‌ బిష్ణోయీ(44) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 26 Mar 2023 04:29 IST

రాజ్‌కోట్‌: విదేశీ వర్తక వ్యవహారాలను పర్యవేక్షించే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) సీనియర్‌ అధికారి జవరీమల్‌ బిష్ణోయీ(44) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ వ్యాపారి నుంచి రూ.5లక్షల లంచం తీసుకుంటున్నారనే ఆరోపణ కింద సీబీఐ శుక్రవారం రాజ్‌కోట్‌లోని డీజీఎఫ్‌టీ కార్యాలయంలో బిష్ణోయిని అరెస్టు చేసింది. నాలుగో అంతస్థులో ఉన్న అతని కార్యాలయంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ తనిఖీలు కొనసాగాయి. ఉదయం 9.45 గం.లకు సోదాలు ముగించబోతున్న సమయంలో జవరీమల్‌ బిష్ణోయీ ఒక్కసారిగా కిటికీలోంచి కిందికి దూకారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని