సర్‌డెనిమ్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం గలిబిపల్లి క్రాస్‌ వద్దనున్న జీన్స్‌ ప్యాంట్‌ ముడి వస్త్రం తయారీ చేసే సర్‌ డెనిమ్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.

Published : 30 Mar 2023 05:40 IST

రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా

లేపాక్షి, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం గలిబిపల్లి క్రాస్‌ వద్దనున్న జీన్స్‌ ప్యాంట్‌ ముడి వస్త్రం తయారీ చేసే సర్‌ డెనిమ్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రోబోటెక్‌ మిషనరీలు, దారపు రోల్స్‌ నిల్వ ఉంచే గోదాము మొత్తం కాలి బూడిదైంది. రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలు పెద్దగా ఎగిసి పడడంతో హిందూపురం, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిపారు. వారు అగ్ని మాపక యంత్రాలతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నించినా ప్రయోజనం లేకపోయింది. అగ్నిమాపక యంత్రాల్లో నీరు పూర్తిగా లేకపోవడంతో చివరకు ఫ్యాక్టరీలో ఉన్న బోరుబావులకు మోటార్లు అమర్చి పైపుల ద్వారా మంటలను అదుపు చేస్తున్నారు.  ఒక షిఫ్టులో ఉన్న కార్మికులు పని ముగించుకుని మరో షిఫ్టు కార్మికులు విధుల్లో చేరే సమయంలో ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు అప్రమత్తమై భయాందోళనతో పరుగులు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని